తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో ఐదు రోజులుగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్, కాలేజీల వద్ద అంగళ్లపై ఈగల్ టీం, పోలీసు సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 322కేసులు నమోదు కాగా, నిబంధనలకు విరుద్ధంగా గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు విక్రయించిన వారిపై జరిమానాలు విధించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని అంగళ్ల నిర్వహకులు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు శనివారం హెచ్చరించారు.