తిరుమల శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. వీరిలో మంత్రి అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ గోరంట్ల వెంకన్న తదితరులు ఉన్నారు. వీరంతా వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్