తిరుమలలో మళ్లీ రీల్స్ కలకలం.. టీటీడీ వార్నింగ్

తిరుమల ఘాట్ రోడ్డు, ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, దర్శన కౌంటర్ల వద్ద యూట్యూబర్ గీతూ రాయల్, ఆమె టీమ్ డాన్స్ చేస్తూ రీల్స్ చిత్రీకరించడం వివాదానికి దారితీసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ ఈ చర్యలను తిరుమల పవిత్రతకు భంగం కలిగించేవిగా అభివర్ణించారు. స్వప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రీల్స్ చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్