రేణిగుంట వసుందర నగర్ ఆర్చ్ సమీపంలో మంగళవారం జరిగిన రైలు ప్రమాదంలో గణేశ్ (30) అనే యువకుడు రైలు కిందపడి ఎడమ కాలును కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఈఎంటీ జి.వెంకటేశ్, పైలట్ గుణశేఖర్ ప్రాథమిక చికిత్స అందించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.