తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సూపర్‌వైజర్లు, సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని, ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.