గురువారం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 20లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన దాతలు సంజయ్ బాబు రూ. 10లక్షలు, హోమిపెట్స్ అధినేత హర్షవర్ధన్ బాబు రూ. 10లక్షలు చొప్పున ఈ విరాళాన్ని అందించారు. ఈ విరాళం చెక్కులను తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఛైర్మన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు, శ్రీవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.