ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, తన సతీమణితో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నష్టపోయిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. తాను 25 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నానని, తన కుటుంబ సభ్యులు కూడా పార్టీకి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.