తిరుమల గజశాలలో ఏనుగులకు ప్రత్యేక సంరక్షణ

తిరుమల గజశాలలో ఏనుగులకు టీటీడీ ప్రత్యేక సంరక్షణ కల్పిస్తోంది. వేసవి దృష్ట్యా షెడ్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేసి చల్లని వాతావరణం కల్పించారు. ఏనుగులకు తగిన ఆహారం, శుభ్రమైన తాగునీరు, పోషకాహారం అందిస్తున్నారు. ప్రతిరోజూ స్నానం చేయించి పరిశుభ్రత పాటిస్తున్నారు. శ్రీవారి సేవల్లో పాల్గొనే గజరాజుల ఆరోగ్యం, సంక్షేమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గజశాలలో ఏనుగుల సంరక్షణను మెరుగుపరిచారు.

సంబంధిత పోస్ట్