తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హోమ్ సైన్స్ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–22, న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) తిరుపతి చాప్టర్ సంయుక్తంగా మార్చి 28న “ఆహార పరిశ్రమలో జీరో వేస్ట్” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాదులోని కెన్యా బయోసైన్సెస్ లిమిటెడ్ సంస్థ ఆర్ & డి విభాగాధిపతి డా. ఎస్. చెన్న కేసవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆహార పరిశ్రమలో వ్యర్థాల నిర్వహణపై ప్రసంగించారు. ప్రొఫెసర్ ఎన్. రజని, ఎన్‌ఎస్‌ఐ తిరుపతి చాప్టర్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. అరుణ, డా. వి. బిందు పాల్గొన్నారు.