టిటిడి ఆధీనంలోకి శ్రీఅభయ అనుగ్రహ వెంకటేశ్వరస్వామి వారి ఆల‌యం

తిరుపతి జిల్లా, నాయుడుపేట మండలం, తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీఅభయ అనుగ్రహ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టీటీడీలోకి విలీనం చేసుకునే కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కే. నరసింగారావు, గ్రామస్థులు ఆలయానికి సంబంధించిన రికార్డులను టీటీడీ అధికారులకు అందించారు. ఈ ఆలయాన్ని తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామి ఆలయ సముదాయంలో చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్