తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జేసీఐ తిరుపతి ఆర్థిక సహకారంతో నిర్మించిన అత్యాధునిక ఇండోర్ బాక్సింగ్ హాల్‌ను సోమవారం శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ హాల్ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ క్రీడాకారులు నిరంతరాయంగా సాధన చేసేందుకు ఉపయోగపడుతుందని, మెరుగైన శిక్షణా సదుపాయాలతో రాష్ట్రంలోని బాక్సర్ల ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.