గురువారం తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ (31) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి గుర్తింపు, మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.