తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద డిప్యూటీ ఈఓ లోకనాథ్ ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్