తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనపై టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తిరుపతిలో మాట్లాడుతూ, వైసీపీ పాలనలోనే ఈ అపచారం జరిగిందని, హిందూ మతంపై నమ్మకం లేని జగన్ పాలనలో ధర్మానికి భంగం కలిగిందని విమర్శించారు. భూమన వంటి నాస్తికుల నేతల పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిందని, వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండానే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా అని ప్రశ్నించారు. తప్పు చేసి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు.