తైవాన్ ప్రజలు అదృష్టంగా భావించే, వాస్తు చేపగా పిలువబడే అర్నా లేదా అరోవనా జాతికి చెందిన బంగారు చేప ఒకటి మాంబట్టు సెజ్లోని అపాచీ పరిశ్రమలో రూ.2 లక్షల విలువతో దర్శనమిస్తోంది. పదేళ్ల కిందట తైవాన్ నుంచి తెప్పించిన ఈ చేప, సహజంగా ఇతర చేపలను దగ్గరకు రానివ్వదు కాబట్టి, ఒక్కోదాన్ని ఒక్కో అక్వేరియంలో ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. పులికాట్ మత్స్యశాఖ అధికారి హిమజ తెలిపిన వివరాల ప్రకారం, ఈ చేపలు 17 ఏళ్లు జీవిస్తాయి.