తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకూ క్యూ లైన్లు చేరగా సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సోమవారం 74,149 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు వచ్చింది. టైంస్లాట్ టోకెన్లు, టికెట్ లు ఉన్నవారికి 4-5 గంటలు, టోకెన్లు లేనివారికి దర్శనంకు ఎక్కువ సమయం పడుతుంది. నేడు ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.