తిరుపతి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈవో స్పష్టం

దిత్వా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు మంగళవారం యథావిధిగా పనిచేస్తాయని డీఈవో కుమార్ సోమవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సెలవు లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు ఈ విషయం తెలిసేలా ఎంఈవోలు, డీవైఈవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. పాఠశాలలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్