తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేకుండా వేచి ఉన్న భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న 63,473 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,796 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.54 కోట్ల ఆదాయం సమకూరింది.