తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. బుధవారం 75,303 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,166 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.3.99 కోట్లుగా నమోదైంది.