తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించామని తితిదే ఈవో శ్యామలరావు మంగళవారం తెలిపారు. ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టామన్నారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ముందుగా స్వామివారికి వస్త్రం కప్పి, పూజ సామగ్రి, ఉపాలయాలు, గోడలను సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేశామని అనంతరం ప్రత్యేక పూజల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు.