తిరుపతి: రేపు ఆ గుడులన్నీ క్లోజ్

చంద్రగ్రహణం కారణంగా, మంగళవారం తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లోని అనేక ఆలయాలు మూసివేయబడతాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు, టీటీడీకి చెందిన కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాలు ఉదయం 9 గంటలకు మూసివేసి, రాత్రి 7:30 గంటలకు తెరిచి శుద్ధి చేస్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక, సూళ్లూరుపేట చెంగాళమ్మ దేవస్థానాలు కూడా మూసివేయబడతాయి. అయితే, శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచి ఉంచుతారు.

సంబంధిత పోస్ట్