తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లికి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా సారె సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న తమ స్నేహబంధాన్ని స్మరించుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు.