విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎపీఎస్‌పీడీసీఎల్ “డయల్ యువర్ సిఎండి” కార్యక్రమాన్ని తిరుపతిలో సోమవారం సిఎండి శివశంకర్ లోతేటి ప్రారంభించారు. తొలివిడతలో 9 జిల్లాల నుంచి 87 మంది వినియోగదారులు తమ సమస్యలను వివరించారు. ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామని, టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800-425-15533 ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సిఎండి తెలిపారు.