సంస్కృతి పరిరక్షణకు కళలు కీలకమని హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ హితవు పలికారు. తిరుపతిలో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గజల్ గాయకుడు శ్రీనివాస్ భగవద్గీతను పెన్ డ్రైవ్ లో విడుదల చేశారు. మాలుపల్లి ఉమ ముద్దుబాల నేతృత్వంలో అష్టలక్ష్మీ వైభవం నాట్యం ఆకట్టుకుంది.