తిరుపతి: ఎస్వీయూ రిజిస్ట్రార్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకులను రిజిస్ట్రార్ అవమానకరంగా దూషించారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. రెండో రోజూ పరిపాలన భవనం ముందు మోకాళ్లపై కూర్చొని, ప్లకార్డులతో నిరసన తెలిపారు. రిజిస్ట్రార్ వ్యాఖ్యలు వెనుకబడిన వర్గాల మనోభావాలను దెబ్బతీశాయని, వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్