తిరుపతిలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. కడప జిల్లాకు చెందిన సుధ అనే మహిళ రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద ఆటోలో ప్రయాణించి తిరుపతిలో దిగిన తర్వాత తన బ్యాగ్‌ను ఆటోలోనే మరచిపోయింది. ఆటో డ్రైవర్ వెంకటరత్నం బ్యాగ్‌ను గుర్తించి, వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బ్యాగ్ యజమానిని గుర్తించి, అందులోని ల్యాప్‌టాప్, బంగారు గొలుసుతో సహా విలువైన వస్తువులను సురక్షితంగా ఆమెకు అందజేశారు.