టీటీడీలో 1000 మందికి పైగా ఇతర మతస్తులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హిందూ దేవస్థానమైన టీటీడీలో ఇతర మతానికి చెందిన వారిని నియమించడం తగదని అన్నారు. “ఇది అన్ని మతాల కోసం సత్రం కాదు, హిందూ ధర్మాన్ని నమ్మని వారిని ఉద్యోగాల నుంచి వెంటనే తొలగించాలి”అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.