తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ ప్లాంట్లను కేంద్ర గృహ నిర్మాణశాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం గురువారం పరిశీలించారు. కేంద్ర కార్యదర్శితో పాటు సంయుక్త కార్యదర్శి (అమృత్ పథకం) ఇషాకాలియా, సాంకేతిక సలహాదారుడు రోహిత్ కక్కర్, రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్యలు నగరపాలక సంస్థ అధికారులతో కలసి తూకివాకం, రామాపురం చెత్త నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు.