తిరుపతి కొర్లగుంటలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హైస్కూల్లో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతున్నట్టు తెలిపారు. లోకేశ్ నేతృత్వంలో విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని, త్వరలో చెస్ శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.