తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మంగళవారం రాత్రి తిరిగి భక్తుల కోసం తెరుచుకుంది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేసిన ఆలయాన్ని, గ్రహణం ముగిసిన తర్వాత టీటీడీ అర్చకులు, అధికారులు శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు. రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించడంతో తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.