తిరుపతి గంగమ్మ జాతరలో రెండో రోజు 'బైరాగి' వేషధారణకు విశేష ప్రాధాన్యత లభించింది. భక్తులు సాధువులు, సన్యాసులుగా అమ్మవారిని దర్శించుకుంటారు. బైరాగి అంటే సర్వసంగ పరిత్యాగి అని, భక్తుడు-దేవుడి మధ్య భేదం లేదనే తత్వంతో ఈ వేషం ధరిస్తారని అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు. త్యాగమే నిజమైన భక్తికి మార్గమని ఆయన పేర్కొన్నారు. భక్తులు వివిధ వేషధారణలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.