తిరుపతి నగరం బైరాగిపట్టేడ సమీపంలోని ఎం. కే. నాయుడు కాలనీలో గురువారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పేలుడు ధాటికి అపార్ట్‌మెంట్‌లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.