విద్యార్థుల్లో ప్రతిభ, నైతిక విలువల పెంపుకు మెగా టీచర్ ప్యారెంట్ 2. 0 ఎంతో ఉపయోగపడుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన చెప్పారు. స్థానిక ఎంజిఎం హైస్కూల్ లో గురువారం మెగా పేరంట్స్, టీచర్స్ మీటింగ్ 2. 0జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.