తిరుపతి: గరుడసేవకు గోవిందరాజస్వామికి రూ. 71 లక్షల నగల కానుక

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరగనున్న గరుడసేవకు టీటీడీ, శ్రీ వేంకటేశ్వరస్వామివారి తరఫున సుమారు రూ. 71 లక్షల విలువైన దివ్యాభరణాలను సమర్పించింది. మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య బంగారు గుండు పతకం, జత పతకాలు, బంగారు కాసుల మాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఈ ఆభరణాలతో అలంకరించిన గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్