తిరుపతి: దర్బార్ కృష్ణుడిగా గోవిందరాజస్వామి దివ్య విహారం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏడవ రోజు శుక్రవారం రాత్రి, శ్రీగోవిందరాజస్వామివారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రబింబంలా ప్రకాశించిన వాహనంపై స్వామివారి దివ్యరూపాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఔషధాలకు అధిపతి, సమస్త జీవజాతికి పోషకుడైన చంద్రుడు జగత్తుకు జీవాధారంగా నిలుస్తాడని, అతని కిరణాలు చల్లదనాన్ని, ప్రశాంతతను, ఆనందాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్