ఏపీ స్టేట్ లెవల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బుధవారం తిరుపతిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రార్థించే పెదవులకంటే సాయం చేసే చేతులే మిన్న అని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టోర్నీ నిర్వహించి, రూ. 1లక్ష బహుమతి అందజేస్తానని తెలిపారు.