తిరుపతి: మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు. అనంతరం అలంకారం, సహస్రనామార్చన నిర్వహించారుసాయంత్రం పంచమూర్తుల తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వ‌హించారు.

సంబంధిత పోస్ట్