తిరుపతి: జగన్ వ్యాఖ్యలపై కంచర్ల సెటైర్లు

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కేఏ పాల్ లేని లోటును వైఎస్ జగన్ తీరుస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ నిర్వహించే ప్రెస్ మీట్లు జబర్దస్త్ షో కంటే ఎక్కువ కామెడీగా ఉంటాయని ఆయన అన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి దరఖాస్తును తప్పుగా నింపడంతో ఉద్యోగం రాలేదని, ఇప్పుడు అతనికి ఉద్యోగం ఇవ్వాలని కోరడం సరికాదని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు జాతిరత్నాలు సినిమాలో అడ్వకేట్ కారు నంబర్‌ను ఐపీసీ సెక్షన్‌గా చెప్పిన సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్