తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు ముందు ఈ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించిన అనంతరం, గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.