ఉద్యోగ విరమణ చేసిన అధికారులు కుటుంబంతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అన్నారు. గురువారం అసిస్టెంట్ ఎగ్జామినర్ రంగయ్య, ఏసిపి బాలాజీ లను ఘనంగా సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలతో నిండిన సేవలను ముగించుకుని విశ్రాంతి జీవితం ప్రవేశిస్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మునికృష్ణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.