హింసకు గురవుతున్న మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించవచ్చని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తో కలిసి ఆయన సఖి వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం మహిళలకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.