ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీన జాబ్ మేళా జరగనుంది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం సాయంత్రం తన కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. స్థానిక బాలాజీ కాలనీలోని ఎస్.వి.సి.సి డిగ్రీ కళాశాలలో నవంబర్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. అభ్యర్థులు నవంబర్ 3వ తేదీలోపు https://naipunyam.ap.gov.in/user-registration లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.