తిరుపతి: డీఎస్సీ-2025లో అవినీతి జరిగిందంటూ ఎంపీ ఆరోపణలు

తిరుపతి ఎంపీ గురుమూర్తి డీఎస్సీ-2025 నియామకాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. గతంలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొందరు అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసి ఉద్యోగాలు కట్టబెట్టిందని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీల ద్వారా కొందరు ర్యాంకులు సాధించారని, నిజాయితీగా పరీక్షలు రాసిన వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్