టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ, తమ జాతి రాజకీయంగా వెనుకబడి ఉందని, సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మాట్లాడుతూ, కులాల మధ్య చిచ్చు పెట్టడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తమిళనాడులో విజయ్ తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలని తమ జాతి ఆకాంక్షిస్తోందని, బలిజ జాతి ప్రతినిధిగా పవన్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ జాతి మద్దతు అవసరం లేదనుకుంటే పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించాలని ఓవీ రమణ డిమాండ్ చేశారు.