తిరుపతి: మైనింగ్‌పై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన పెద్దిరెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం మల్లయ్యకొండలో ఇనుప ఖనిజ మైనింగ్‌కు శ్రీకారం చుట్టిందని, వైఎస్సార్సీపీ హయాంలో రూ. 20కోట్లతో మల్లయ్యకొండ అభివృద్ధి చేసి, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఎర్రకొండలో మైనింగ్‌కు కేంద్ర అనుమతులు వచ్చినా అమలు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం సాధుకొండ, శివపురం, ఎర్రకొండ ప్రాంతాల్లో మైనింగ్‌కు కూటమి ప్రభుత్వం టెండర్లు, అనుమతులు ఇచ్చిందని విమర్శించారు. మల్లయ్యకొండ పవిత్రతకు భంగం కలిగిస్తే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్