తిరుపతి: పేదలఇంటివద్దకే పెన్షన్ పంపిణీ;కూటమి ప్రభుత్వం ఆదర్శం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పేదల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని జీవకోన 48, 49వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు రూ. 6,000, డయాలసిస్ రోగులకు రూ. 10,000, మంచానికే పరిమితమైన వారికి రూ. 15,000 అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో మొత్తం 2.62 లక్షల మందికి రూ. 113 కోట్ల పెన్షన్లు పంపిణీ జరుగుతోందని కలెక్టర్ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్