తిరుపతి: బ్లాక్ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్ రూ. 300కు విక్రయం

కూటమి ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌కు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో లీటర్‌కు రూ. 250 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారని భూమన ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పరిస్థితిని తీసుకొచ్చిందని, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్