జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ ప్రారంభించారు. తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్యవివాహాల నివారణ, మగవారి భాగస్వామ్యం, మాతా-శిశు రక్షణ అంశాలపై ర్యాలీలో విశేషంగా ప్రచారం చేశారు.