తిరుపతికి చెందిన కె. అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా, ఆమె కుమార్తె శారద తన కుటుంబంతో కలిసి బుధవారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి రూ. 10 లక్షల విరాళం అందించారు. ఈ విరాళం డిడిని ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.