టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ. 10లక్షల విరాళాన్ని అందజేశారు. తమ మనవరాలు కుప్పాల దర్శన పేరుతో అందించిన ఈ విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో టీటీడీ అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరికి గురువారం సమర్పించారు. ఈ విరాళం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందుతాయి.